Natural Hair Growth Tips / Hair Packs – Hair Tips
Natural Hair Growth Tips / Hair Packs – Hair Tips
చాలామందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎప్పుడు తల శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే వారానికి మూడు సార్లు తలస్నానం చెయ్యాలి.
- చాలా మంది జుట్టు తొందరగా ఆరడానికి హెయిర్ డ్రయ్యర్ ను ఉపయోగిస్తారు. అలా చేయకూడదు. వాటిని సహజంగా ఆరనివ్వాలి లేదా వాటిని కాటన్ టవల్ తో ఆరబెట్టుకోవాలి.
- వారానికి రెండు సార్లు సహజంగా ప్యాక్ వేసుకోవాలి.
Hair Packs
-
- మెంతులు, పెరుగు కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే రుబ్బుకొని వెంట్రుకలకు పెట్టుకోవాలి, కుదుళ్లకు పట్టించాలి. అలా ఒక గంట పాటు ఉంచుకోండి తరువాత కుంకుడు కాయలతో లేదా గాఢత తక్కువగా ఉండే షాంపూ తో తలస్నానం చెయ్యాలి.అలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే చుండ్రు కూడా పోగొడుతుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.
- గుడ్డులోని తెల్ల సొన, పెరుగు,ఆలివ్ ఆయిల్ మిశ్రమాలను కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించండి. ఇలా చేస్తే జుట్టు బలంగా మారుతుంది.
- అలోవేరా గుజ్జుని జుట్టుకు పెట్టుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఇలా అన్ని సహజ పద్ధతులు పాటించి మనం తీసుకునే ఆహారం మంచిది ఉండాలి.
- మందారం పూలు గాని ఆకులు గాని, తీసుకొని paste గా చేసి దానిని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఒక గంట తర్వాత తల స్నానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే నల్ల జుట్టు తెల్లగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది.
మనం తీసుకునే ఆహారంలో గుడ్డు,పాల వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే ఒక ఆయిల్ ను ఉపయోగించాలి.
- కొన్ని కరివేపాకులు, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ని వేడి చేసి అందులో కరివేపాకులు వేసి మరగనివ్వాలి. తర్వాత దానిని వడకట్టి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా అవుతుంది. అలాగే జుట్టు పెరుగుతుంది.
- మన వంటగదిలోని ప్రతి ఒక్కటీ మనకి ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయల రసాన్ని తీసుకొని జుట్టు కుదుళ్ళకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇది జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. - అలాగే మందార నూనెతో కూడా జుట్టు పెరుగుతుంది. కొన్ని మందార పువ్వులను తీసుకుని కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి తర్వాత దాన్ని వడకట్టి జుట్టు పెట్టడం వల్ల చాలా వరకూ జుట్టు సమస్యను అరికట్టవచ్చు. అలాగే చుండ్రు సమస్య అరికడుతుంది.
- గుంటగలగరాకు నూనె తో కూడా జుట్టు పెరుగుతుంది.
- అలాగే పెరుగును జుట్టుకి పెట్టడం వల్ల చాలా మంచిది. పెరుగు జుట్టుకి హెయిర్ కండీషనర్ గా ఉపయోగపడుతుంది. దానివల్ల జుట్టు చాలా silky గా మారుతుంది.
- నిమ్మరసం జుట్టుకి పెట్టడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
- అరటి పండును మెత్తగా చేసి అందులో ఒక గుడ్డు సోనా , తేనె కలిపి జుట్టు కుదుళ్ళకు పెడితే మృదువుగా మారుతుంది.
- గుడ్డు , పెరుగు కలిపి జుట్టుకు మర్దనా చేసి ఆరాక కడిగేస్తే జుట్టు అందంగా మారుతుంది.