Mullangi Benefits in Telugu / Health Benefits of Eating Radishes
Mullangi Benefits in Telugu / Health Benefits of Eating Radishes
ముల్లంగి తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ముల్లంగి లో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో calcium, phosphorus, vitamin c ఉన్నాయి. ముల్లంగి తో పాటు ముల్లంగి ఆకులను కూడా వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
- ముల్లంగిని గ్రైండ్ చేసి జ్యూస్ గా తీసుకొని తాగుతూ వుంటే లివర్లో కలిగే వ్యాధులను నివారిస్తుంది.
- ముల్లంగి విత్తనాలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ కొంచెం అన్నంలో కలుపుకుని తింటే స్త్రీలలో రుతుస్రావ దోషాలు పోతాయి.
- ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు కొంచెం ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతాయి.
- విపరీతంగా జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే త్వరగా దోషాలు నివారించబడతాయి.
- మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళు కరిగించడానికి ముల్లంగి ఎంతో మంచిది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తింటే ఈ సమస్య తగ్గుతుంది.
- ముల్లంగి రసం తీసి దానిలో నూనె వేసి నూనె మాత్రమే మిగిలేలా కాచి ఆ నూనెను భద్రపరుచుకుని ఆ నూనెను చెవిపోటు ఉన్నవారు చెవిలో మూడు చుక్కలు వేసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- ముల్లంగి లో ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి.
- పెద్దవాళ్లు చాలామందికి అర్షమొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ముల్లంగి తింటే ఎంతో మేలు.
- తిన్న ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్లు భోజనం తర్వాత ముల్లంగిని మిరియాల పొడి తో తీసుకుంటే తొందరగా జీర్ణం అవుతుంది.
- డయాబెటిస్ తో బాధపడేవారు ముల్లంగి కూర తింటే ఎంతో మేలు. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ముల్లంగి తరచూ తినేవారిలో కామెర్ల వంటివి రాకుండా ఉంటాయి.
- మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే చాలా మంచిది.
- ముల్లంగి తింటే మూత్రాశయ సమస్యలు తొలగిపోతాయి.
- ముల్లంగి కాకుండా ముల్లంగి ఆకుల వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది.
- దీని ఆకులలో calcium, nutrition’s ఉంటాయి.
- శ్వాస వ్యవస్థల్లో అడ్డంకులను నిరోధిస్తుంది.
- ముల్లంగిని తినడం వల్ల అలర్జీలు జలుబు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.