Health Benefits of Menthulu / Fenugreek Benefits – Health Benefits
Health Benefits of Menthulu / Fenugreek Benefits – Health Benefits
మెంతుల ఉపయోగాలు
మెంతుల గురించి అందరికీ తెలిసినవే, వీటిని ఎక్కువ వంటకాలలో ఉపయోగిస్తారు. వీటిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని పొడిచేసుకుని తీసుకున్నా తీసుకున్నా, నానబెట్టి తీసుకున్న చాలా మంచిది.
వీటిని ఎక్కువగా ఊరగాయలలో పోపులో వాడుతుంటారు. మెంతుల్లో పోషకాలు, పీచు పదార్థాలు, క్యాల్షియం ఇనుములు ఉంటాయి.
మహిళల్లో ఆరోగ్య సమస్యలు నియంత్రిస్తుంది:
బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. మెంతికూర పప్పు గా ఎక్కువగా తినిపిస్తే చాలా మేలు. బిడ్డ పుట్టే ప్రక్రియను సులభంగా చేస్తుంది. ఇది లేబర్ pain ని తగ్గిస్తుంది. దీనిని గర్భాధారణ సమయంలో మితంగా తీసుకోవాలి. నొప్పితో కూడా బహిష్టులో మెంతులు చాలా సహాయపడుతుంది. మెంతులు రోజూ తీసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్తో బాధపడేవారు రోజు మెంతులను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు.
ఒక చెంచా మెంతుల్ని మీ ఆహారంలో తీసుకుంటే heart burn తగ్గిస్తుంది.
- మెంతులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ మధుమేహం తగ్గుతుంది.
- మలబద్ధకం ఉంటే రోజుకి ఒక స్పూన్ మెంతులు నానబెట్టి తీసుకుంటే మంచిది.
గుండెను కాపాడుతుంది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది:-
- మెంతులు రోజు తీసుకోవడం వల్ల గుండె సమస్య నుండి కాపాడుతుంది.
నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గిస్తుంది:-
- మెంతుల కు నొప్పులు తగ్గించే గుణాలు ఉంటాయి. ఇవి రోజూ ఆహారంలో లేదా డైరెక్ట్ గా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
గ్యాస్ట్రిక్ సమస్యను అరికడుతుంది:-
- జీర్ణ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి మెంతులు ఒక గొప్ప ఔషధం.
- కడుపులో వచ్చే అనేక రకాలైన సమస్యలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి మెంతులు ఉపయోగపడతాయి:-
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? దానికి మెంతులను రాత్రి నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది. ఇలా 3 నెలలు చేస్తే బరువు తగ్గుతారు.