Skip to content
Top 10 Best Amazing Turmeric Beauty Tips For Face
- పసుపు లో కొంచెం గంధం పొడి, పచ్చిపాలు వేసి కలుపుకోవాలి. కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన మచ్చలు మొటిమలు తగ్గుతాయి.
- పసుపులో కొంచెం టమాటా రసం కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.
- పసుపు లోకి కొంచెం తేనె వేసి కలిపి ముఖానికి పూసుకోవాలి. ఆ తర్వాత ముఖం కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చక్కని అందం మీ సొంతమవుతుంది.
- పసుపులో కలబంద గుజ్జును కలిపి ముఖానికి పెట్టుకొని అరగంట తర్వాత కడిగితే ముఖ ఛాయా పెరిగి ముఖం అందంగా మారుతుంది.
- పసుపులో అలోవెరా జెల్ కలిపి ముఖానికి బాగా అప్లై చేసి ఆరాక చల్లటి నీటితో ముఖం కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం ఎంతో అందంగా కాంతివంతంగా మారుతుంది.
- పసుపు లో నిమ్మరసం వేసి ఫేస్ కి అప్లై చేసి గంటసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి వాటర్ తో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన నల్లధనం పోయి తెల్లగా మారుతుంది. పసుపు చర్మంపై ఉండే మలినాలు తొలగిస్తుంది.
- పచ్చి పసుపులో శనగపిండి కొంచెం వేసి ఇందులో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి బాగా అప్లై చేసి 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగి వేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
- పసుపులో కాఫీ పొడి 1 స్పూన్, చక్కెర 1 స్పూన్, శెనగపిండి 1 స్పూన్, నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టిన పేస్టును ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయటం వలన పేరుకుపోయిన నల్లధనం పోయి ముఖం తెల్లగా మారుతుంది.
- పసుపు ను తీసుకొని ప్రతి రోజు స్నానం చేసే ముందు పెట్టుకొని తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన అవాంఛిత రోమాలు రావు . చర్మం అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు.
- పసుపును రోజు స్నానం చేసే ముందు పెట్టుకోవడం వలన చర్మ దురదలు కూడా ఉండవు.