Hair tips

Top 8 Amazing Tips For Long Hair జుట్టు అందంగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి చిట్కాలు

Top 8 Best Tips For Long Hair జుట్టు అందంగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి చిట్కాలు

  • ఒక బౌల్లో ఆలివ్ ఆయిల్తీ తీసుకొని అందులో క్యాస్టర్ ఆయిల్ (ఆముదం), కొబ్బరి నూనె వేసి కలిపి జుట్టుకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా నెలకు ఒకసారి చేస్తే జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది.
  • ఉల్లిగడ్డ ను తీసుకొని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీ జుట్టు ఊడిపోకుండా చక్కగా పెరుగుతుంది.
  • కొబ్బరి నూనెను జుట్టుకు బాగా పట్టించి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  • జుట్టుకు అన్నం వార్చిన గంజి తీసుకుని తలకు బాగా పట్టించి తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా నెలకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  • కొబ్బరి నూనెలో మందార ఆకులు వేసి బాగా మరిగించాలి. అలా మరిగిన తర్వాత దానిని వడబోయాలి. వడబోసిన నూనెను తలకు బాగా పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుంది.
  • కోడిగుడ్లు తీసుకొని అందులో పెరుగు వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేసి రెండు గంటల తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.
  • టీ పొడి తీసుకొని,అందులో కాఫీ పొడిని వేసి కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. కలిపి దీనిని జుట్టుకు బాగా పట్టించి అరగంట ఉంచుకొని తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది ఇలా చేస్తే తెల్ల జుట్టు రాదు.
  • శిరోజాలకు మెంతులు గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంట్రుకలకు బాగా పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన కురులు ఆరోగ్యంగా ఉంటాయి.