Health tipsskin care tips

Top 10 Best Amazing Turmeric Beauty Tips For Face

Top 10 Best Amazing Turmeric Beauty Tips For Face

  1. పసుపు లో కొంచెం గంధం పొడి, పచ్చిపాలు వేసి కలుపుకోవాలి. కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన మచ్చలు మొటిమలు తగ్గుతాయి.
  2. పసుపులో కొంచెం టమాటా రసం కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.
  3. పసుపు లోకి కొంచెం తేనె వేసి కలిపి ముఖానికి పూసుకోవాలి. ఆ తర్వాత ముఖం కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చక్కని అందం మీ సొంతమవుతుంది.
  4. పసుపులో కలబంద గుజ్జును కలిపి ముఖానికి పెట్టుకొని అరగంట తర్వాత కడిగితే ముఖ ఛాయా పెరిగి ముఖం అందంగా మారుతుంది.
  5. పసుపులో అలోవెరా జెల్ కలిపి ముఖానికి బాగా అప్లై చేసి ఆరాక చల్లటి నీటితో ముఖం కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం ఎంతో అందంగా కాంతివంతంగా మారుతుంది.
  6. పసుపు లో నిమ్మరసం వేసి ఫేస్ కి అప్లై చేసి గంటసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి వాటర్ తో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన నల్లధనం పోయి తెల్లగా మారుతుంది. పసుపు చర్మంపై ఉండే మలినాలు తొలగిస్తుంది.
  7. పచ్చి పసుపులో శనగపిండి కొంచెం వేసి ఇందులో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి బాగా అప్లై చేసి 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగి వేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
  8. పసుపులో కాఫీ పొడి 1 స్పూన్, చక్కెర 1 స్పూన్, శెనగపిండి 1 స్పూన్, నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టిన పేస్టును ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయటం వలన పేరుకుపోయిన నల్లధనం పోయి ముఖం తెల్లగా మారుతుంది.
  9. పసుపు ను తీసుకొని ప్రతి రోజు స్నానం చేసే ముందు పెట్టుకొని తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన అవాంఛిత రోమాలు రావు . చర్మం అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు.
  10. పసుపును రోజు స్నానం చేసే ముందు పెట్టుకోవడం వలన చర్మ దురదలు కూడా ఉండవు.