skin care tips

Fenugreek Seeds for Skin / మెంతులతో చర్మం కాంతివంతంగా ఉంటుంది – Beauty Tips

Fenugreek Seeds for Skin / మెంతులతో చర్మం కాంతివంతంగా ఉంటుంది.

మెంతుల గురించి నీకు చాలా రకాలుగా తెలుసు తినడానికి కాకుండా వీటిని ముఖానికి అప్లై చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.

ఆయుర్వేదంలో మెంతుల కు చాలా మంచి ప్రాముఖ్యత ఉంది.

మెంతులతో పూర్తిగా చర్మానికి ఎలాంటి side effects లేకుండా కాపాడుతుంది.

చర్మం కాంతివంతంగా చేస్తుంది:-

రాత్రి నాన బెట్టిన మెంతులను మరుసటి రోజు దంచి అందులో కొద్దిగా పసుపు వేసుకొని వాటిని కలిపి ముఖానికి అప్లై చేసి ఆరాక శుభ్రం చేసుకుంటే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.

మెంతులు cleanser గా ఉపయోగపడుతుంది:-

మెంతులు ముఖానికి మంచి క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది.  ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.  పాలల్లో మెంతుల పేస్ట్ కలిపి ముఖానికి పట్టించి ఆరాక శుభ్రం చేయాలి.  ఈ విధంగా చేయడం వల్ల మెంతులు మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది.

మెంతులు మొటిమలు మచ్చలను తొలగిస్తుంది:-

ముందుగా మెంతులను పౌడర్ గా చేసుకోవాలి. తరువాత అందులో శనగపిండి, పెరుగుతో కలిపి ముఖానికి ముఖ్యంగా మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చెయ్యాలి. ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.

మెంతులతో sun tan తొలగిపోతుంది:-

మెంతులు tan ని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. మెంతులను పౌడర్ చేసి అందులో తేనె కలిపి ముఖానికి అప్లై చేసి శుభ్రం చెయ్యాలి. ఇలా చేస్తే ఎంత ఎండలో ముఖం అయినాసరే చర్మం శుభ్రం అవుతుంది.

Best Health Benefits of మెంతులు