Top Best Benefits Of Lemon నిమ్మకాయ యొక్క ప్రయోజనాలు
Top Best Benefits Of Lemon నిమ్మకాయ యొక్క ప్రయోజనాలు
నిమ్మ రసంలో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
నిమ్మకాయ కూడా అనేక చర్మ మరియు ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగపడతాయి.
ఇందులో విటమిన్ సి ఉంటుంది.
లెమన్ వాటర్ తాగడం వల్ల
ప్రతిరోజు నిమ్మరసం కలిపిన నీటిని త్రాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు మరియు చర్మం కాంతివంతంగా మారుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించుటకు
ప్రతి రోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఆహారంలో రోజు నిమ్మరసం చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
చర్మ సంరక్షణకు
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు సహాయపడుతుంది.
కొద్దిగా నిమ్మరసంలో తేనె కలిపి దానిని ముఖానికి అప్లై కేసి చేసి ఆరాక కడిగేస్తే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు.
- ముల్తానీ మట్టి ఒక spoon తీసుకొని, దానిలో లెమన్ జ్యూస్ 1 spoon తీసుకొని దానిని కలిపి ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేస్తే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
- 1 spoon శెనగపిండి, 1 spoon honey, 1 spoon నిమ్మకాయ రసం కలిపి మీ ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేస్తే మీ ముఖం మృదువుగా తయారవుతుంది.
టాన్ తగ్గిస్తుంది.
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి.
నిమ్మకాయ రసాన్ని తేనే తో కలిపి ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖం పైన ఉన్న tan తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
రక్తహీనత కోసం
నిమ్మకాయను ఆహారంలో చేర్చడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది.
జుట్టు కుదుళ్లను నివారిస్తుంది.
- నిమ్మరసం కొద్దిగా తీసుకొని దానిని జుట్టు కుదుళ్ళకు పట్టించి ఒక గంట తర్వాత కడిగేస్తే జుట్టు లో ఉన్న చుండ్రు పోతుంది మరియు జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.
-
నిమ్మరసంలో విటమిన్ బిసి మరియు ఫాస్పరస్ ఉంటుంది.
-
ఇది హెయిర్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది మరియు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.
-
1 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో, 2 టేబుల్ స్పూన్ బాదం నూనె mix చేసి తలకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
జుట్టు రాలడం
- నిమ్మ రసాన్ని కొబ్బరి నూనెతో మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.
షైనీ హెయిర్
- పొడిబారిన జుట్టు ఉంటే నిమ్మరసం మరియు పెరుగు mix చేసి తలకు అప్లై చేయాలి.
- ఇది షైనీ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది.
జుట్టు పెరుగుదల
- నిమ్మరసాన్ని ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి.
- ఇలా ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పెరుగుతుంది.
జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది
నిమ్మరసంలో ఎగ్ వైట్ మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.
జుట్టు బలంగా ఉంటుంది
- ముందుగా నిమ్మరసం తీసుకొని అందులో కొబ్బరినూనె మిక్స్ చేయాలి
- ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
- ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ హెయిర్ రాలే సమస్య తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
జీర్ణక్రియ లో సహాయపడుతుంది.
- మీరు అజీర్తితో బాధపడుతుంటే తేనే నిమ్మరసం మీ జీర్ణక్రియను శుభ్రం చేస్తుంది.
- మీ ప్రేగుల కదలికలు కూడా మెరుగుపడి కడుపుబ్బరం తగ్గుతుంది.
మొటిమల నివారణకు
- ముఖం పై మచ్చలు ఉంటే నిమ్మరసం తో మసాజ్ చేస్తే మీ మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించుట
- నిమ్మ రసం రోజూ త్రాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.