Best 8 Tips to Reduce Cracked Heels in Legs కాళ్ళ పగుళ్లు తగ్గించే అద్భుతమైన చిట్కాలు
Best 8 Tips to Reduce Cracked Heels in Legs కాళ్ళ పగుళ్లు తగ్గించే అద్భుతమైన చిట్కాలు
- కుంకుడు కాయ గింజలు నానబెట్టి ఆ గింజలను కాళ్ళ పైన పెట్టి బాగా రుద్దాలి. ఇలా చేయడం వలన కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
కొబ్బరి నూనె వేప నూనె కలిపి కాళ్ళకు పెట్టి బాగా మసాజ్ చేయాలి.
నెగిటివ్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి కాళ్లపైన రుద్దాలి ఇలా చేయడం వలన కూడా పగుళ్లు తగ్గుతాయి..
- వేడి వాటర్ తీసుకొని అందులో కళ్ళు ఉప్పు వేసి షాంపూ కూడా వేసి నిమ్మరసం వేయాలి. బాగా మిక్స్ చేయాలి. చేసి అందులో పాదాలు పెట్టాలి. అలా 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత బ్రష్తో పాదాలను రుద్దాలి. ఇలా చేయడం వలన కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
- ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ బియ్యప్పిండి తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి కొంచెం టమాటా రసం వేసి కలపాలి ఆ తర్వాత దానిని పాదాలకు పూసుకోవాలి. ఇలా చేస్తే కాళ్ళ పగుళ్లు పోయి అందంగా మారుతాయి.
- కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే పాదాలను శుభ్రంగా కడిగి రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె గాని పాదాలకు పెట్టుకోవాలి. పెట్టుకొని రాత్రంతా ఉంచుకోవాలి. ఇలా వారం రోజులు చేయటం వలన కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.
- ఉప్పు లో కొద్దిగా నిమ్మరసం వేసి పాదాలకు పెట్టుకొని ఆరాక కడిగేయాలి. కొబ్బరి నూనె పాదాలకు రాసి వేడినీళ్లలో ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
- బియ్యప్పిండిలో తేనె కలిపి వెనిగర్ కూడా వేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాళ్ళకు ళ్ళకు పెట్టి గోరువెచ్చటి వాటర్ లో ఉంచాలి. ఇలా చేయడం వలన కూడా కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.
- వేపాకు తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్టు లోకి పసుపు వేసి కలిపి పాదాలకు పెట్టుకోవాలి దానిని 40 నిమిషాలు ఉంచుకుని తరువాత వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పగుళ్ళు తగ్గుతాయి.
- వేడి నీటిలో నిమ్మకాయ పిండి అందులో పాదాలను ఉంచాలి. ఇరవై నిమిషాల తర్వాత పొడిగుడ్డతో తుడిచి వేయాలి ఇలా చేయడం వలన కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.