Skip to content
- ఉసిరికాయ తినడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెజబ్బులను నివారిస్తాయి. అలాగే అలసట నీరసం తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తినడం వలన పైత్యం తగ్గుతుంది.
- డయాబెటిక్ ఉన్నవారికి ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. కంటిని మెరుగుపరిచి కంటి జబ్బులు రాకుండా చేస్తుంది. ఉసిరి తింటే బి.పి తగ్గుతుంది. ఉసిరికాయ రసం అందులో తేనె కలిపి త్రాగితే ఉబ్బసం తగ్గుతుంది.
- ఉసిరిని తీసుకొని జ్యూస్ లాగా చేసుకుని తాగితే కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రక్తం శుద్ధిచేస్తుంది. ఉసిరి పొడి పసుపు పొడి కలిపి ఇందులో తేనె వేసి కలిపి ప్రతి రోజు 2 సార్లు తాగాలి. గోరు వెచ్చని పాలు తాగాలి. ఇలా తాగితే స్త్రీల తెల్లబట్ట తగ్గుతుంది. ఉసిరి తినటం వలన ముడతలు రాకుండా చేస్తుంది. మచ్చలు తగ్గుతాయి.
- ఉసిరి రసం, నిమ్మరసం కలిపి తలకు బాగా పట్టించి 20 నిమిషాలు ఉంచుకొని తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల జుట్టు తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. ఉసిరిని తీసుకోవటం వలన షుగర్ వ్యాధిని అరికట్టవచ్చు. జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
- ఉసిరికాయ రసం తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది, క్యాన్సర్ ను కూడా అరికడుతుంది. ఉసిరి పొడి, ఆముదం, పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని జుట్టుకు పెట్టుకోవాలి. పెట్టుకొని గంటసేపు ఉంచు కోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.