Hair tipsHealth tips

Top Best Benefits of Curry Leaves కరివేపాకు ఉపయోగాలు

Top Best Benefits of Curry Leaves కరివేపాకు

కరివేపాకు ఉపయోగాలు

                                            ప్రతి వంటకాల్లో కరివేపాకు కనిపిస్తుంది. దీనిని చాలామంది రుచికోసం వేస్తారు. ఇది కమ్మని రుచిని ఇస్తుంది. మన పూర్వీకులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే. 

జీర్ణశక్తిని పెంచుతుంది 

                      కరివేపాకు తింటే అజీర్తి తగ్గుతుంది.      శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గిస్తుంది.
కరివేపాకు వేర్లను శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. 

జుట్టు కుదుళ్లను మెరుగుపరచడానికి

కరివేపాకు లో విటమిన్ ఏ ఉంటుంది. దీనిని రోజు ఆహారంలో వినియోగిస్తే మన జుట్టు కుదుళ్ళకు సహాయపడుతుంది మరియు జుట్టును బలంగా చేస్తుంది. కొన్ని కరివేపాకులు తీసుకుని పేస్ట్ చేసుకుని దానిని జుట్టు కుదుళ్ళకు అప్లై చేసి గంట తర్వాత కడిగేస్తే మీ జుట్టు మృదువుగా తయారవుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు.

కరివేపాకు నూనె

ఒక బౌల్లో కొబ్బరి నూనె పోసి అందులో కొన్ని కరివేపాకు వేయాలి. నూనె కలర్ మారాక ఆ నూనెను ఒక గాజుసీసాలో భద్రపరచాలి. దీనిని వారానికి ఒక్కసారి చేయాలి. ఇది పెట్టుకున్న next రోజు షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జుట్టు బలంగా మారుతుంది.

  • కరివేపాకులో ఫైబర్ క్యాల్షియం ఫాస్పరస్ ఇనుము మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
  • కరివేపాకు చర్మ సంరక్షణకు సహాయపడుతుంది.
  • పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నం లో కొంచెం కరివేపాకు పొడి నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.
  • కరివేపాకులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
  • రోజు ఒక ఐదు కరివేపాకులు తింటే డయాబెటిస్ తగ్గుతుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
  • జ్ఞాపకశక్తి తక్కువగా ఉందని భావించే వారు మతిమరుపు ఉన్న వారు నిత్యం కరివేపాకు తింటుంటే లేదా జ్యూస్ లో గాని తీసుకుంటే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  • ఒక బౌల్లో సరిపడా నీళ్ళు పోసుకుని అందులో కొన్ని కరివేపాకులు వేసి మరిగించి వడకట్టి రోజు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.