పాలకూర, క్యాప్సికం, క్యారెట్, చిలగడ దుంప వంటి కూరలు తింటే కంటి సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
బాదం నూనె ముఖంపై ప్రతిరోజు రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
బాదం నూనెలో కొబ్బరినూనె అలోవెరా జెల్ ను కలిపి ముఖంపై అప్లై చేస్తే ముడతలు తగ్గుతాయి.
బీట్ రూట్ పేస్టులాగా చేసి కొన్ని పాలు, కొంచెం తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరాక చల్లటి నీరుతో ముఖం కడుక్కోవాలి . చర్మం ఎంతో కాంతి వంతంగా మారుతుంది.
శనగపిండిని తీసుకుని ఇందులో పసుపు, రోజు వాటర్ కలిపి శరీరమంతా పూసుకొని అరాక కడిగి వెయ్యాలి. ఇలా చెయ్యడం వలన చర్మం మెరుస్తుంది.