Hair tips

Fenugreek Seeds For Hair / Fenugreek Seeds to Prevent Hair Fall – Hair Tips

Fenugreek Seeds For Hair / Fenugreek Seeds to Prevent Hair Fall – Hair Tips

మెంతులు,  మెంతి  ఆకులతో అందాన్ని పెంచుకోవచ్చు. ఇందులో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. మెంతులు   వెంట్రుకలు రాలుటను అరికడుతుంది .

ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం చాలా మందిలో ఉంది. దీనికి కారణం ఒత్తిడి మరియు మనం తినే ఆహారంలో సహజమైన విటమిన్స్ అందకపోవడం వల్ల జుట్టు రాలే సమస్య ఉంటుంది.

మెంతులలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది ముఖానికే కాకుండా ఆరోగ్యానికి వెంట్రుకలకు కూడా చాలా మంచిది, మెంతులు తలకి పెట్టడం వల్ల తలపై ఉన్న వేడిని తగ్గిస్తుంది  మరియు చుండ్రును నివారిస్తుంది. 

చర్మాన్ని చల్లబరుస్తుంది మరియు కేశాలు తిరిగి బలంగా పెరగడానికి సహాయపడతాయి. 

మెంతులు జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది:

కొన్ని మెంతులు తీసుకొని వాటిని రాత్రంతా నానబెట్టి,  మరుసటి రోజు వాటిని రుబ్బీ దానిని తలకు పట్టించాలి.

ఒక గంట తరువాత కడిగేస్తే జుట్టు కి మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే మీ జుట్టు చాలా మెరుస్తుంది మరియు మంచి పోషణ జుట్టుకు అందుతుంది.

తెల్ల జుట్టును నివారిస్తుంది:

కొన్ని మెంతులు,కొన్ని వేపాకులు, కొన్ని మందార ఆకులు, కొన్ని కరివేపాకులు ఇవన్నీ కలిపి వాటిని  గ్రైండ్ చేసి తలకు పట్టించాలి.

ఒక గంట తరువాత తలస్నానం చేస్తే మీ జుట్టు నల్లగా మారుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు తెల్లగా ఉన్న మీ జుట్టు నల్లగా అవుతుంది.

చుండ్రును నివారిస్తుంది:

కొన్ని మెంతులను రాత్రంతా నానపెట్టి వాటిని రుబ్బి అందులో పెరుగు వేసి దానిని తలకు పట్టిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.  పెరుగు ఒక హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది.

జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది:

కొన్ని మెంతులను రుబ్బి అందులో గుప్పెడు మందార ఆకులను,  అలోవేరా ను కలిపి దాన్ని తలకు పట్టించి ఆరాక తలస్నానం చేస్తే మీ జుట్టు మంచిగా పెరుగుతుంది. మీ జుట్టు పెరుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది. 

జుట్టు మెరుగుపరుచుటకు జుట్టు రాలకుండా ఉండడానికి:

కొబ్బరి నూనెలో కొన్ని మెంతులను వేసి దానిని కాచి వడకట్టుకోవాలి.

దానిని తలకు పట్టించి మర్దనా చేసి ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే జుట్టు పెరుగుతుంది. అలాగే జుట్టు రాలకుండా సహాయపడుతుంది.

జుట్టు సమస్య నివారణకు ఒక మంచి తైలం (నూనె):

కొన్ని వేపాకులు,  కొన్ని మందారాలు,  కొన్ని మెంతులు,  కొన్ని ఉల్లిపాయలు, 

కొంచెం కరివేపాకులు,  కొంచెం అలోవేరా,  కొంచెం  గుంటగలగరాకులు తీసుకోవాలి.

అలాగే కొబ్బరి నూనె మీకు  సరిపడేంత తీసుకొని stove on చేసి ఒక పాన్ లో ఇవన్నీ వేసి మరగబెట్టాలి.

తర్వాత stove off చేసి ఒక బౌల్లో వడకట్టుకోవాలి తరువాత దానిని ఒక గాజు సీసాలో పోసుకుని భద్రపరచుకోవాలి.

ఈ నూనెను తలకు పెట్టుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. మీకు ఉన్న ఏ జుట్టు సమస్యనైనా తగ్గిస్తుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది.