Health tips

Benefits of Lemon / నిమ్మకాయ ప్రయోజనాలు – Health Tips

Benefits of Lemon / నిమ్మకాయ ప్రయోజనాలు – Health Tips

  • నిమ్మకాయ వల్ల అద్భుత లాభాలు ఉంటాయి.
  • రోజు ఉదయాన్నే వేడి నీళ్లలో నిమ్మరసం వేసి కలిపి త్రాగితే చాలా రోగాలు కూడా మాయమవుతాయి.
lemon with hot water
lemon with hot water

వీటిని వంటింట్లో వాడుతారు.

నిమ్మకాయ కూర లో వేయడం వల్ల కూరలకు రుచి పెరుగుతుంది.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే  ఔషధ గుణాలు నిమ్మరసంలో ఉంటాయి.

అధిక బరువు ఉన్నవారు నిమ్మరసం తాగితే సన్నగా అవుతారు. గుండెకు సంబంధించిన సమస్యలు రావు. డయాబెటిస్ ఉన్న వాళ్ళు నిమ్మ రసం తాగితే కంట్రోల్ లో ఉంటుంది. నిమ్మ రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రావు.

నిమ్మరసం తాగితే ఎసిడిటీ రాకుండా ఉంటుంది.

చర్మం కూడా అందంగా మారుతుంది. ముడతలు లేకుండా ఉంటుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించి చాలా సమస్యలు నయం అవుతాయి. గొంతుకు వచ్చే ఇన్ఫెక్షన్లకు నిమ్మరసం మంచి ఔషధం. గొంతులో దురద, దగ్గు,  బొంగురు పోవడానికి తాగుతారు. వేడి నీళ్లు గొంతు శుభ్రం చేయడానికి సహాయం చేస్తుంది.

జుట్టు కి నిమ్మరసం పెట్టుకుంటే చుండ్రు పోతుంది.

నిమ్మ జ్యూస్ తో దంతాలు మెరుస్తాయి. నిమ్మ తొక్కతో దంతాల మీద రుద్దడం వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. నోటినుండి దుర్వాసన వస్తుంటే నిమ్మరసంలో ఉప్పు చిటికెడు వంటసోడా కలిపి దంతాలు రుద్దుకుంటే మంచిది. గర్భిణీ లకు కూడా చాలా మంచిది విరోచనాలు అరికట్టే శక్తి ఉంటుంది. త్వరగా తగ్గుతుంది. రోజుకు నాలుగుసార్లు నిమ్మరసం త్రాగితే పచ్చకామెర్ల వ్యాధి తగ్గుతుంది.

వడదెబ్బ తగిలినప్పుడు నిమ్మ నీళ్లలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. వంటకాల్లో పచ్చి కూరలు చికెన్ నిమ్మకాయ వాడని వారు ఉండరు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండాకాలంలో షర్బత్ గా తాగుతారు. దీనివల్ల చాలా శక్తి పెరుగుతుంది. నిమ్మరసం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి మెదడుకు ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Disadvantages of Lemon:-

నిమ్మరసం రోజుకు సగం చాలు. మోతాదుకు మించి వాడొద్దు. ఎక్కువ వాడితే ఎసిడిటీ వస్తుంది.

ఫ్రిజ్లో పెట్టుకున్నా చాలా రోజులు ఉంచుకున్న నిమ్మ సోడా తాగవద్దు.  నిమ్మ పండు నుండి అప్పుడే తీసిన రసాన్ని తాగాలి. అది హెల్త్ కి చాలా మంచిది. అది ఏదైనా సరే మంచిది కదా అని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. నిమ్మరసంలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా చేస్తాయి. నిమ్మ రసం చాలా ఉపయోగకరం.