Health tips

బాదం నీ ఈ విధంగా తినడం వలన చాలా మేలు……

బాదం  నీ ఎలా తినాలో ఏ విధంగా తింటే మనకు ఆరోగ్యం వస్తుందో చాలా మందికి  తెలియదు…

badam, badam benefits
Benefits of eating badam

ఈ కరోనా  సమయంలో మన శరీరంలో ఇమ్యునిటీ పవర్ పెరగడానికి బాదం చాలా ఉపయోగపడుతుంది.

ఈ బాదం పప్పు చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ ఎవరైనా తినొచ్చు.

ఈ బాదం పప్పు లో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి

ఇందులో లో మెగ్నీషియం ప్రోటీన్స్,  ఫైబర్, న్యూట్రియన్స్, ఒమేగా త్రీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ,  బి 12, క్యాల్షియం, జింక్, పుష్కలంగా ఉంటాయి.

బాదం పప్పు తినడం వల్ల మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మరియు ఎంతో మేలు జరుగుతుంది.

మధుమేహంతో బాధపడేవారు ఈ బాదంలు తినడం వలన ఇన్సులిన్ అదుపులో ఉంటుంది మరియు ఆరోగ్యంగా ఉంటారు.

మన శరీరం అలసటగా ఉంది అనిపించినప్పుడు నాలుగైదు బాదం పప్పులు తినడం వలన మన శరీరానికి తక్షణ శక్తి వస్తుంది.

అయితే చాలా మందికి ఇవి ఎలా తినాలో ఏ విధంగా తింటే మనకు ఆరోగ్యం వస్తుందో తెలియదు.

బాదంపప్పును రాత్రి నానబెట్టి ప్రొద్దున తినడం వలన మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.

రోజూ బాదం తినడం వల్ల అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు

మన చర్మ సౌందర్యానికి కూడా ఈ బాదం ఎంతో ఉపయోగపడుతుంది.

బడికి వెళ్లే పిల్లలకి ఇవి రోజూ ప్రొద్దున ఇవ్వడం వల్ల వారు చాలా చలాకీగా చురుగ్గా ఉంటారు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.

వీటిని పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ తినొచ్చు. అలా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అందుకని బాదం తినండి ఆరోగ్యంగా ఉండండి.