Hair tips

Top 6 Amazing Healthy Hair Benefits With Curry Leaves కరివేపాకు తో జుట్టు ఆరోగ్యం

Top 6 Amazing Healthy Hair Benefits With Curry Leaves కరివేపాకు తో జుట్టు ఆరోగ్యం

1) కరివేపాకును తీసుకొని కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత నూనెను చల్లార్చాలి . అలా చల్లార్చిన నూనెను పోసి పక్కన పెట్టుకోవాలి. ఈ కొబ్బరి నువ్వు నేను వారానికి రెండు సార్లు  తలకు పెట్టుకోవాలి.  ఇలా చెయ్యడం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

                                                          

2) కరివేపాకు ఆకులను గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. మనము పేస్ట్లా చేసుకున్న కరివేపాకును తలకు బాగా పట్టించాలి. అలా పట్టించిన కరివేపాకు బాగా ఆరనివ్వాలి అంటే సుమారుగా రెండు గంటలు ఆరనివ్వాలి. ఆ తర్వాత జుట్టును బాగా కడిగి వేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఎంతో అందంగా ఉంటుంది.

 

3) కరివేపాకులు నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత అందులో ఉప్పు వేసి వడబోయాలి. వడపోసిన తరువాత ఈ నీళ్ళను త్రాగాలి. ఇలా నెలరోజులు చేయడం వలన జుట్టు రాలే సమస్య ను అరికడుతుంది. అలాగే కొత్త వెంట్రుకలు వస్తాయి.

 

4) కరివేపాకు మునగాకు ఈ రెండు కడిగి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.  అందులో బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేయాలి తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసి వడపోయాలి.  వడపోసిన తర్వాత రోజు ఒక్క గ్లాస్ త్రాగాలి. ఇలా ఇరవై రోజులు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

5) కరివేపాకులు తీసుకుని అందులో జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి చింతపండు వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని అన్నంలో వేసుకుని తినాలి. ఇలా రోజూ తినడం వలన జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.

6) కరివేపాకు తీసుకొని ఇందులో వాటర్ పోసి మిక్సీ పట్టుకోని దీనిని వడపోయాలి.  వడపోసిన తరువాత  ఒక సీసాలో పోసుకోవాలి. పోసుకొని తలకు బాగా అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో తలస్నానం  చేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే  జుట్టు రాలే సమస్య తగ్గి మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.