Hair tips

Amazing Tips to Cure White Hair to Black Hair Naturally తెల్ల జుట్టు నల్లగా మారాలంటే

Amazing Tips to Cure White Hair to Black Hair Naturally తెల్ల జుట్టు నల్లగా మారాలంటే

  1. ఉసిరిని ఎండలో ఎండబెట్టి ఉండగా తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ వేసుకొని తలకు బాగా పట్టించాలి. పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
  2. కరివేపాకు తీసుకొని కొబ్బరినూనెలో వేసి బావా మరిగించాలి. చల్లారిన తర్వాత వడపోసి ఈ రోజు తలకు బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది, దృఢంగా ఉంటుంది.
  3. కాఫీ పౌడర్ తీసుకొని అందులో వాటర్ పోసి మరిగించాలి. మరిగిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారాక తలకు బాగా పట్టించాలి. అలా జుట్టుకు పట్టించి 30 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత జుట్టును కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.
  4. కాఫీ పొడి, టీ పొడి నీ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం వేసి ఇప్పుడు అందులోనే కాఫీ పొడి, టీ పొడి వేయాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు వేడి వాటర్ తీసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నా గిన్నెలను అందులో పెట్టాలి. అలా పెట్టి తలకు పట్టించి మర్దన చేయాలి. ఇలా చేయడం వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
  5. జుట్టు నల్లగా మారాలంటే పసుపును వేసి బాగా ఫ్రై చేయాలి. నల్లగా మారే వరకూ పెంచాలి ఆ తర్వాత అందులో కొబ్బరి నూనె వేసి తలకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే తెల్ల జుట్టు పోయి నల్లగా మారుతుంది.
  6. నీళ్లలో టీ పొడి వేసి మరగనివ్వాలి. మరిగిన తరవాత వడపోయాలి. అలా వడపోసి ఇందులో కి కాఫీ పొడి లవంగాల పొడి. బీట్ రూట్ రసం అందులో పోయాలి. నిమ్మరసం వేసి హెన్నా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని తలకు పెట్టుకుని ఆరాక కడిగేసుకోవాలి. షాంపూ పెట్టుకోవద్దు. మామూలుగా తలస్నానం చేయాలి. అంతే తెల్ల జుట్టు మాయమవుతుంది.